దేశంలో కరోనా కేసులు తగ్గినా… ఏపీలో అక్రమ కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గినా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని విమర్శించారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అక్రమ కేసులకు రౌడీ షీట్లకు భయపడే నాయకులు టీడీపీలో లేరన్నారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలిడిటీ అని అన్నారు. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పోలీసులు పెట్టిన అక్రమ రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.