మండలిని తండ్రి తీసుకువస్తే.. కుమారుడు రద్దు చేశారు
అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు, దాన్ని కచ్చితంగా పరిరక్షిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో ఎదురవుతున్న సమస్యలను చంద్రబాబుకు వివరించేందుకు రాజధాని రైతులు, మహిళలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ మాట వినలేదని మండలి చైర్మన్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. చేసిన తప్పులను సీఎం జగన్ సరిచూసుకోవడం లేదు. నేను జోలె పట్టింది ఐదు కోట్ల మంది ప్రజల కోసం. నేను మొదలుపెట్టిన పనులను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు. నేను ప్రారంభించిన పనులను తర్వాత వచ్చిన వైఎస్ ఆపలేదు. మండలిని తండ్రి తీసుకువస్తే.. కుమారుడు రద్దు చేశారు. విశాఖలో భూములు కొని అక్కడ డబ్బు సంపాదిస్తున్నారు అని చంద్రబాబు విమర్శించారు.













