రాజధానిని మార్చడానికి మీరెవరు?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమానదూరంలో అమరావతి పెట్టామని చెప్పారు. రాజధానిపై శాస్త్రీయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా రాజధానిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం. విశాఖను ఐటీ, ఫార్మా హబ్‌గా అభివృద్ది చేయాలనుకున్నామని వివరించారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని అడిగారు. ఆదానీ గ్రూప్ వచ్చి ఉంటే నాలుగైదు ఏళ్లలో విశాఖ హైదరాబాద్‌కు సమానంగా అభివృద్ధి చెందేది. ఓ కంపెనీని తేవడం చాలా కష్టం, వెళ్లగొట్టడం ఈజీ అన్నారు.
ఫార్చూన్ 500 కంపెనీలకు కేంద్రంగా విశాఖను చేయాలనుకున్నాం. విశాఖలో మెట్రో కూడా శ్రీకారం చుట్టాం, కానీ అడ్డుపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ హబ్ చేయాలనుకున్నాం, రిలయన్స్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. ప్రపంచంలోనే 3 రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? ఇది పిచ్చి ఆలోచన కాకపోతే మారేంటి? రాజధాని మార్చడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది? ఇది పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు.













