రెండు సమానం అంటేనే ఒప్పుకున్నాం
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్యాకేజీ ఇస్తే ఎలా ఒప్పుకున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన స్పందించి అసలు కారణం వివరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ సమానం అంటేనే ఒప్పుకున్నట్లు సృష్టం చేశారు. రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయాం, ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు ఇచ్చి మనకు ఇవ్వకపోతే ఎలా ఒప్పుకుంటాం? అంటూ ఒకింత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా విభజన చట్టాన్ని, బడ్జెట్ను క్షణ్ణంగా పరిశీలించాలని సూచించారు.













