రాహుల్ కంటే చంద్రబాబే బెటర్
ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీ కంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఉత్తమమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులు అర్హత గలవారని ఆయన వ్యాఖ్యానించారు. మాయావతి, మమత బెనర్జీ లేదంటే చంద్రబాబు.. ఎన్డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడం ఉత్తమం అని అన్నారు.













