Chandrababu: డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి : చంద్రబాబు
పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సూచించారు. బాపట్ల (Bapatla) పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ `టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ (Lokesh) తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారు స్మార్ట్ఫోన్ల (Smart phones) కు బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల (schools) నుంచే ప్రారంభం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.













