ఆధ్యాత్మిక నగరిగా అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధ్యాత్మిక నగరిగా రూపుదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్కు రాజధాని అమరావతిలో పరిధిలోని నెక్కల్లు గ్రామంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ శాంతికోసం పవిత్ర సందేశమిస్తూ, 147 దేశాల్లో 9వేల కేంద్రాల్లో సేవలందిస్తున్న బ్రహ్మాకుమారీస్ సంస్థ ఉన్న ప్రతి ప్రాంతమూ ప్రశాంతంగా ఉంటుందని కొనియాడారు. అందుకే అమరావతి పరిధిలో ఈ సంస్థకు 10 ఎకరలు మంజూరు చేశామన్నారు. అసెంబీల స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సమాజానికి మంచి సందేశాన్నిస్తూ, శిక్షణ ఇస్తున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం శుభసూచికమన్నారు. రాజయోగిని జానకీ దాదీజీ, మంత్రులు అయ్యన్నపాత్రుడు, పుల్లారావు, ఆనందబాబు, నారాయణ, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













