తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల టికెట్ ఇచ్చిన చంద్రబాబు..

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో రోజుకొక కొత్త వార్త సంచలనం సృష్టిస్తుంది. బరిలోకి దిగబోయే అభ్యర్థుల విషయంలో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు టిడిపి తన మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 13 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లతో పాటు 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రకటించిన ఎంపీ అభ్యర్థులలో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఉండడం. ప్రస్తుతం టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అందుకే ఏపీలో లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కృష్ణ ప్రసాద్ కి కల్పించారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కృష్ణ ప్రసాద్ బీజేపీ తరఫున టికెట్ ఆశించారు. అయితే అప్పట్లో అది కుదరలేదు.. చివరికి బాపట్ల లోక్ సభ స్థానం నుంచి కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.