Chandrababu : మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
సూపర్ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం (Talliki vandanam pathakam) నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కొటో తరగతి, ఇంటర్ (Inter)లో చేరిన వారికీ తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు (Admissions) పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ జీవో విడుదల చేయనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ (Mega DSC), దీపం-2 పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోంది.













