ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా..? : చంద్రబాబు ధ్వజం
ఏపి పర్యటనలో తలసాని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
టిఆర్ ఎస్ నేతల ఏపి పర్యటనల్లో టిడిపి నేతలు పాల్గొనరాదు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తాం. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి. స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలి. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని ఫణంగా పెట్టరాదు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయరాదు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించను. తెలంగాణలో 26కులాలను బిసి జాబితానుంచి తొలగించారు. కళింగ, తూర్పుకాపు, గవర, శెట్టిబలిజ తదితర కులాలను తొలగించి బిసిలకు అన్యాయం చేశారు. ఇక్కడకొచ్చి అదే బిసిలపై కపటప్రేమ చూపుతున్నారు. 26బిసి కులాలకు అన్యాయం చేసినవారితో జగన్ అంటకాగుతున్నారు.
టిఆర్ ఎస్ తో జతకట్టిన వైసిపికి 26 కులాల బిసిలే బుద్ది చెప్పాలి. అవినీతి గొంగళి పురుగును కెసిఆర్ కౌగిలించుకున్నారు. అవినీతి గొంగళిపురుగు(జగన్)తో స్నేహం తెలంగాణ కోసమేనా..? ప్రజలకు కెసిఆర్, కెటిఆర్ లే జవాబివ్వాలి. మోది చెప్పింది చేయడమే కెసిఆర్ కర్తవ్యం. నరేంద్ర మోది చేతిలో కీలుబొమ్మ జగన్. మూడుపార్టీల కుట్రలకు ప్రజలే బుద్ది చెబుతారు. బిజెపి, టిఆర్ ఎస్, వైసిపి కుతంత్రాలకు గుణపాఠం తప్పదు.













