ఏపీని తలలేని మొండెం గా చేసిన జగన్..
ఎన్నికల ప్రచార నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం జరుపుతున్న ప్రచారంలో భాగంగా బాపట్లలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజధాని పేరుతో జగన్ మూడుముక్కల ఆట ఆడాడని విమర్శించారు. ప్రస్తుతం జగన్ చేసిన పనికి ఆంధ్ర రాష్ట్రం తలలేని మొండెం లా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి తల లాంటి రాజధాని లేకుండా జగన్ చేశాడని.. జగన్ ప్రభుత్వం పన్నుల భారానికి మధ్యతరగతి వ్యక్తి నడ్డి విరుగుతోందని పది రూపాయలు ఉచితంగా ఇచ్చినట్టే ఇచ్చి 100 రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













