Narendra Modi : ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫ్రాన్స్, అమెరికా పర్యటన విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) అభినందనలు తెలిపారు. ఇరు దేశాలతో వాణిజ్యం, రక్షణ, ఇంధన సంబంధాలను తన పర్యటన ద్వారా మోదీ బలోపేతం చేశారన్నారు. ఏఐ యాక్షన్ సమ్మిట్ (AI Action Summit )కు సహ అధ్యక్షత వహించడం, గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ (Global AI Innovation ) లో దేశాన్ని ముందంజలో ఉంచడంలో ప్రధానమంత్రి నాయకత్వ పటిమ ఎంతో అభినందనీయమని కొనియాడారు. దూరదృష్టి, అంకితభావంతో మోదీ మన దేశానికి వికసిత్ భారత్ (India) 2047 వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ నేతగా ఆ పాత్రను సుస్థిరం చేస్తున్నారన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు భారత్కు దొరకడం గొప్ప వరమని వ్యాఖ్యానించారు.













