డొనాల్డ్ ట్రంప్‌నకు సీఎం చంద్రబాబు అభినందనలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. తమ దేశాన్ని ముందుకు నడిపించే ప్రక్రియలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ట్రంప్ మొదటి పదవీ కాలంలో ఇండో`యూఎస్ సంబంధాలు గణనీయంగా బలోపేతమయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని మోదీ, ట్రంప్ నాయకత్వంలో రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రెండు దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందింప జేసుకుంటాయని విశ్వసిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.













