Balakrishna :బాలకృష్ణను అభినందించిన సీఎం చంద్రబాబు
పద్మభూషణ్ పురస్కారం పొందిన తెలుగు సినీ లెజెండర్, హిందపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna )ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అభినందించారు. లెజెండరీ ఎన్టీఆర్ (NTR) వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital) ద్వారా అంకితభావంతో ఎంతో మందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తినిస్తున్న నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం లభించిందన్నారు.













