రామోజీరావుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల పుష్పాంజలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్, శేఖర్ గుప్తా, గులాబ్ కొఠారి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. పత్రికా రంగంతో పాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. వేదిక వద్ద రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా ప్రముఖులు వీక్షించారు.













