ఎన్నికల ఖర్చులకు విరాళాలు.. టీడీపీ కొత్త స్ట్రాటజీ..
రాబోయే ఎన్నికల ఖర్చుల నిమిత్తం పార్టీకి విరాళాలు ఇవ్వవలసిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ మహా యజ్ఞంలో పాల్గొనాలి అని ఆయన కోరారు. పార్టీకి ఇచ్చే విరాళం.. తెలుగు నేలకు ఇస్తున్నట్లుగా భావించి ఇవ్వాలని ఆయన తెలిపారు. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా టీడీపీఫర్ఆంధ్రా.కామ్ (https://tdpforandhra.com) అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. మీకు తోచినంత విరాళంగా ఇవ్వవచ్చని.. విరాళాలు ఇచ్చే వారికి అకౌంటబిలిటీగా తమ పార్టీ ఉంటుందన్నారు. ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారు అన్న విషయాన్ని రసీదుల రూపంలో ఇస్తామని పేర్కొన్న చంద్రబాబు ఈ విరాళాలు 80సీ కింద క్లెయిమ్ చేసుకుని అవకాశం కూడా ఉందని తెలిపారు. తమ పార్టీకి ఈ వెబ్ సైట్ ద్వారా మొదటగా చంద్రబాబు ఒక రూపాయి తక్కువ లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు.













