ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని పదవీకాలాన్నీ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలఖరుతో ఆమె పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు స్పందించిన కేంద్రం సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన నీలం సాహ్ని నవ్యాంధప్రదేశ్కు తొలి మహిళ సీఎస్. ఎల్.వి.సుబ్రమణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆమె పదవీకాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది.













