చంద్రబాబు, లోకేశ్ కు భద్రత కల్పించాలి : కేంద్ర హోంశాఖ ఆదేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు కల్పిస్తున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. జడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇటీవల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. భద్రత కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హోంశాఖ గత ఏడాది నవంబరు 4న చంద్రబాబు ర్యాలీలో రాళ్ల దాడిపై నివేదిక కోరింది. చంద్రబాబు లోకేశ్‌కు భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌ను ఆదేశించింది. ఈ మేరకు జులై 27న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ లేఖ రాసినట్టు సమాచారం. ప్రతిపక్ష నేతలపై దాడులపైనా కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.













