Amaravati: లోక్సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభ (Lok Sabha) ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ (Nityananda Rai) ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై గంటసేపు చర్చించేందుకు స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) అనుమతించారు. అవసరమైతే మరో గంట చర్చిద్దామని చెప్పారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్సభలో చెప్పారు. బిల్లుపై చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి








