అమరావతినే ఏపీ రాజధాని… నిధులు విడుదల చేసిన కేంద్రం
అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతినే ఏపీ రాజధానిగా పేర్కొంటూ 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్ పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రొవిజన్ తీసుకొచ్చింది. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లను అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126 కోట్లు అంచనా వేసింది. ఈ బడ్జెట్లో రూ.లక్షల రూపాయలు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించింది. జీపీవోఏకి భూసేకరణ వ్యయం రూ.6.69 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. 2021`22 బడ్జెట్లో ఉద్యోగుల నివాస గృహాల భూసేకరణ వ్యయం రూ.21 కోట్లుగా అంచనా వేసిన కేంద్రం రూ.18.30 కోట్లు ఖర్చు చేసింది. 300 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది.













