రాహుల్ కు సీఎం చంద్రబాబు అభినందన
కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన రాగాల వెంకట రాహుల్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన రాహుల్ వెయిట్ లిఫ్టింగ్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కుటుంబ వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీనిచ్చారు. రాహుల్‌ను సన్మానించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.













