సీఐడీ నివేదిక అంతా కాకమ్మ కబుర్లే : సీబీఐ మాజీ డైరెకర్టర్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ రిపోర్టుపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు స్పందించారు. సీఐడీ విచారణ అధికారి దాఖలు చేసిన నివేదిక అంతా కాకమ్మ కబుర్లు లాగా ఉందని ఆయన ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలు, తప్పుడు సమాచారంతో చంద్రబాబుపై కోర్టులో వాదనలు వినిపించారు. కేసుకు సంబంధంలేని ఉదాహరణలతో గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులను కూడా తప్పుగా అన్వయించి చూపారు. సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులను తప్పుగా ప్రస్తావించారు అని పేర్కొన్నారు.













