అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి
నవ్యాంధ్రలో వారానికి రెండు రోజులు బసవతారకం క్యాన్సర్ క్లినిక్ వైద్య సేవలు అందిస్తుందని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలో క్యాన్సర్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నందమూరి తారకరామారావు సొంత జిల్లాలో బసవతారకం క్యాన్సర్ క్లినిక్ కార్యకలాపాలు ప్రారంభించడం హర్షణీయమన్నారు. క్యాన్సర్ క్లినిక్‌లో వారానికి రెండు రోజుల పాటు రోగులను వైద్యులు పరీక్షిస్తారని తెలిపారు. అతి త్వరలో అమరావతిలో 1000 పడకల అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సభాపతి కొడెల శివప్రసాదరావు, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపీ నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.













