Employee Unions:దీపావళికి ప్రభుత్వం నుంచి శుభవార్త.. ఉద్యోగ సంఘాల నేతలు

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్థాయిలో తొలిసారి జరిగిన సమావేశం ఇది. ఈ దీపావళి (Diwali) కి ప్రభుత్వం నుంచి శుభవార్త (Good news)ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పీఆర్సీ (PRC) కమిషన్ ఏర్పాటుతో పాటు పెండిరగ్ డీఏలు చెల్లింపులు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ విధానం, దశల వారీగా సమస్యల పరిష్కారం వంటి వాటికి మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav)ల నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఓ కార్యాచరణ రూపొందించే విధంగా కసరత్తు చేపట్టారు. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడాన్ని నేతలు స్వాగతించారు.