ఎప్పుడు అరెస్టు చేస్తారా.. సీఎం కుర్చీ దక్కుతుందా?
వైసీపీ పార్టీలోని వారే ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్టు చేస్తారా, ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందని, స్వయంగా నారాయణస్వామి వ్యాఖ్యలు చేయడం అనుమానం కలుగుతోందని అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు పెట్టిన అక్రమ కేసును ఖండిస్తున్నామన్నారు. ఆర్కేపై కక్షసాధింపులు మాని, సీఎం ఇంటి దొంగలపై దృష్టి పెట్టాలని సూచించారు.













