ఫిబ్రవరి 2 నుంచి బుద్ధ ఫెస్టివల్
ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు అమరావతిలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బుద్ధ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గండికోటలో త్వరలోనే రోప్ వేను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్యాటక శాఖ బుద్ధిజాన్ని ప్రమోట్ చేస్తోందని సృష్టం చేశారు. బుద్ధ ఫెస్టివల్ కార్యక్రమానికి 2000 మంది మౌగ్స్ వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 100 ప్రదేశాలలో ఈ బృందాలు పర్యటిస్తాయని వెల్లడించారు. పర్యాటక శాఖ తరపున రాష్ట్రంలో పెద్దయెత్తున ఉద్యోగాలు కల్పించనున్నామని తెలిపారు. అలీబాబా కంపెనీతో పర్యటక శాఖ, ఐటీ శాఖలు సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.













