ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు ఈ నామినేషన్ పత్రాన్ని అందించారు.బొత్సతో పాటు ఆయన సతీమణి రaాన్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లు కలిసి అందజేశారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ 530పై చిలుకు మాకు ఓట్లు ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దింపడం ఏమిటని అన్నారు. ఎన్నికలు ప్రజా స్వామ్య బద్ధంగా జరగాలని కోరుకుంటున్నాని అన్నారు. స్పష్టమైన మెజార్టీ వైసీపీకి ఉన్నప్పుడు టీడీపీ పోటీ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం అవుతుందన్నారు. ఎవరో బిజినెస్ మన్ ని తీసుకొచ్చి పోటీకి పెడతానని ప్రచారం జరుగుతుంది అని అన్నారు. రాజకీయాలంటే వ్యాపారమా అని ప్రశ్నించారు.













