రాజకీయ లబ్ధి కోసం ఆయనే ఆ దాడి చేయించుకున్నారా? : మంత్రి బొత్స
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జరిగిన దాడి వాస్తవమని, ఆ దాడిని స్వయంగా ఆయనే చేయించుకున్నారనే భావన కల్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారయణ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ రిపోర్టును కొన్ని వార్త సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై నక్సల్స్ దాడి చేశారని, రాజకీయ లబ్ధి కోసం ఆయనే ఆ దాడి చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. కోడికత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో అలా చేశాడో తెలియాల్సి ఉందన్నారు.
జగన్పై జరిగిన ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే వైసీపీ డిమాండ్ అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. ప్రైవేటీకరణకు మా ప్రభుత్వం వ్యతిరేకం. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపేయాలని పోరాడుతున్నాం. అఖిలపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు. అందుకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లటం లేదు. అఖిలపక్ష పార్టీలపై మాకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవం. బీఆర్ఎస్, జనసేన కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రం పట్ల అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ది లేదు. అందుకని మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం అని తెలిపారు.













