అమిత్ షా చెప్పే వరకూ.. జీవీఎల్ కు తెలియదా? : మంత్రి బొత్స
కేంద్ర హోమంత్రి అమిత్ షా చెప్పే వరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి తెలియదా? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడుతూ ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదో ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్థమవుతోంది. ప్రధాని మోదీతో మా బధం ఎలా ఉందో, అమిత్‌షాతోనూ అలానే ఉంది. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవు. మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. అన్ని రాష్ట్రాలతో పాటు 2 వందేభారత్ రైళ్లు తప్ప బీజేపీ ఏమిచ్చింది? 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చి ఉద్ధరించామంటే ఎలా? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి. బీజేపీ నుంచి మాకు ఎలాంటి వెన్నుదన్ను ప్రత్యేకంగా లేదు అని అన్నారు.













