గుండు ఖాయమేనా..?
ఇటీవల మంత్రి బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సీనియర్ మంత్రిగా, అపార రాజకీయ అనుభవం కలిగిన బొత్స.. ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. తన విధానానికి భిన్న బొత్స… త్వరలో టీడీపీ, జనసేన కనిపించవన్నారు. వచ్చే ఎన్నికలే వాటికి చివరికి ఎన్నికలన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే.. వచ్చే ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు కనిపిస్తే .. గుండు గీయించుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే వైసీపీ సర్కార్ పై ప్రజల్లో క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఓ వేళ వైసీపీ గెలిచినా కూడా.. టీడీపీ, జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు దక్కే అవకాశముంది. దీంతో బొత్స సత్యనారాయణ గుండుకు సిద్ధంగా ఉండాలని కౌంటర్స్ పేలుతున్నాయి.













