Shahrukh Khan: నిరాశలో షారుఖ్ ఫ్యాన్స్
వరల్డ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే మెట్‌గాలా(Metgala) ఈవెంట్ ఇవాళ ఉదయం 3.30గంటలకు న్యూయార్క్ లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో మొదలైంది. ఈ ఈవెంట్ కు ఇండియా నుంచి షారుఖ్ ఖాన్(Shah rukh kha,), ప్రియాంక చోప్రా(priyanka Chopra), నిక్ జోనాస్(Nick Jonas), కియారా అద్వాణీ(Kiara Advani), సింగర్ దిల్జిత్ దోసాంజ్(Diljith Dosanj) తో పాటూ ఇషా అంబానీ(Isha Ambani) హాజరై రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.
ఈ రెడ్ కార్పెట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోకి వచ్చాయి. అయితే ఈ ఈవెంట్ లో షారుఖ్ ఫోటోలు, అతని లుక్స్ పై ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. దానికి కారణం మెట్‌గాలా ఈవెంట్ ఫోటోలను షారుఖ్ తన అకౌంట్ నుంచి కాకుండా అతని మేనేజర్ పూజా దదలానీ అకౌంట్ నుంచి షేర్ చేయడం.
దానికి తోడు షారుఖ్ లుక్స్ కూడా ఈ ఈవెంట్ లో అసలు బాలేవు. బ్లాక్ సూట్ లో లేయర్డ్ జ్యుయలరీ వేసుకుని, చేతిలో కర్ర, కళ్లకు గాగుల్స్ పెట్టుకుని షారుఖ్ లుక్ ఎంతో కొత్తగా ఉంది. ఆ లుక్ షారుఖ్ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. ఎప్పుడూ ఎంతో స్టైలిష్ గా కనిపించే షారుఖ్ ఇలా ఉన్నాడేంటని కొందరు కామెంట్ చేస్తుంటే, ఇది చూడ్డానికా మేం ఇంత సేపు నిద్ర మానుకుని కూర్చున్నాం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.













