PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్ మాధవ్

విశాఖలో సారథ్యం బహిరంగ సభను ఆదివారం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) తో పాటు, రాష్ట్ర నేతలు హాజరవుతారని తెలిపారు. విశాఖలోని రైల్వే మైదానం వేదిక ఈ సభ జరగనుంది. సారథ్యం బహిరంగ సభలో విశాఖలోని పార్టీ ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. కడప(Kadapa) నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా వివేష స్పందన వచ్చింది. ఈ యాత్రలో చాయ్‌పే చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుతున్నాయి. అనంతపురంలో సూపర్ సిక్స్ (Super Six) సూపర్ హిట్ సభ విజయవంతమైంది అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) పై వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామా ఆడిరదని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు.