రాయలసీమను రెండో రాజధాని చేయాలి
రాయలసీమ ప్రాంతాన్ని రెండో రాజధాని చేయాలని కోరుకుంటున్నానని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్యవేదికగా 17 ఏళ్ల నుండి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు కర్నూలు నుంచి రాజధానిని తెలంగాణకు తరలిస్తున్నా ఊరికే ఉన్నారని చెప్పారు. ఇప్పుడున్న నాయకులు కూడా ఆంధ్ర ప్రాంతానే అభివృద్ధి చేపడుతున్నారన్నారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయవాదుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించి కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని వారికి మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తాను కూడా ఢిల్లీలో వాదనలు వినిపిస్తానని న్యాయవాదులకు హామీ ఇచ్చారు.













