24న ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 23న భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన (నోటిఫికేషన్) జారీ చేయనుంది. భవనంలో మొదటి అంతస్తుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా భవనంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా పలు సదుపాయాలు కల్పించారు.













