విశాఖలో బిమ్ స్టెక్ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
వారణాసి నుంచి హాల్దియా, సుందర్బన్, బంగ్లాదేశ్ జలమార్గాల మీదుగా త్రిపురకు నౌకలో సరకు రవాణ సౌకర్యం మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానుందని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. జల రవాణాతో రవాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన బిమ్ స్టెక్ నౌకాశ్రయాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బిమ్‌స్టిక్ దేశాలైన భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్ నౌకాశ్రయ సదస్సులో భాగంగా ఒక వేదికపైకి వచ్చినందున పరస్పర ప్రయోజనం ఉన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
విశాఖలో సీఈఎంఎస్ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారీటైమ్ షిప్బిల్డ్) పేరిట నౌక నిర్మాణానికి అవసరమైన నిపుణుల కోసం శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంతి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఏపీలో రామాయపట్నంలో నౌకాశ్రయం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్‌కు సంబందించి రూ.70 వేల కోట్ల పెట్టుబడికి ప్రణాళిక కోరితే అదాని సంస్థ ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో వారికి కేటాయించిన భూమిని తగ్గించామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.













