Big offer for Mega Brother: మెగా బ్రదర్ కు కూటమి నుంచి బడా ఆఫర్..
ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి (Deputy cm) పవన్ కళ్యాణ్( Pawan Kalyan) .. అన్న మెగా బ్రదర్ నాగబాబు ( Naga Babu) ఎంతోకాలంగా తమ్ముడి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఆ పార్టీలో ఆయన ఒక కీలక నాయకుడు అయినప్పటికీ.. అనకాపల్లి ఎంపీ (Anakapalli MP) టికెట్ ను కూటమి ఒప్పందాల కారణంగా త్యాగం చేశాడు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మూడు సీట్లలో రెండు టీడీపీ కి మరొకటి జనసేనకి దక్కుతుందని.. ఆ ఒక్క సీటు కచ్చితంగా నాగబాబుకి చెందుతుందని ప్రచారం జరిగింది.
నిజానికి మొదటి నుంచి ఓ ఎంపీ సీటు నాగబాబుకి అన్న ప్రచారం సాగుతోంది.. అయితే సడన్ గా సీన్లోకి బిజెపి ఎంట్రీ ఇవ్వడంతో ముందు నుంచి వేసుకున్న లెక్కలు కాస్త తారుమారు అయ్యాయి.. కమలనాదుల తరఫున ఆర్ క్రిష్ణయ్య (R.Krishnaiah) రాజ్యసభకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. నిజానికి వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేసినప్పుడు.. బీసీ ఉద్యమం వైపు వెళ్తారే తప్ప తిరిగి పార్లమెంట్ కి రారు అని అందరూ భావించారు. అయితే సడన్గా తన ప్లాన్ మార్చుకున్న క్రిష్ణయ్య.. బిజెపి తరఫున సీటుని దక్కించుకున్నాడు. అయితే ఈ విషయంపై మొదటి నుంచే పూర్తి అవగాహన ఉండడంతోటే మెగా బ్రదర్ నాయకుడి కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్నాను అంటూ ఒక ట్వీట్ పెట్టారు అని తాకు నడుస్తోంది. అంతేకాదు దీని వెనక పవన్ స్కెచ్ కూడా భారీగా ఉందని తెలుస్తోంది..
అసలు విషయం ఏమిటంటే.. రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఉండే ఈ ఎంపీ పదవుల కంటే కూడా 2006లో ఖాళీ అవ్వబోతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకి ఇచ్చే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం ఉందట. ఆ సీటు దక్కితే ఏకంగా ఆరు సంవత్సరాల పాటు ఎంపీగా అధికారంలో ఉండవచ్చు. ఈ బడా ఆఫర్ సైలెంట్ గా అందింది కాబట్టే మెగా బ్రదర్ ఈ సీటును త్యాగం చేశారు అన్న టాక్ నడుస్తోంది. అంటే మొత్తానికి 2026లో నాగబాబుకి ఓ భారీ పదవే దక్కే అవకాశం కనిపిస్తోంది.













