సూళ్లూరుపేటలో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ రూపొందుతోంది. పట్టాణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెం వద్ద దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 670 సీట్ల సామర్థ్యం, 3డీ సౌండ్ సిస్టమ్‌తో పాటు, దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటు చేస్తుండడం విశేషం. రూ.40 కోట్ల వ్యయంతో యూవీ క్రియేషన్స్ సంస్థ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. 106 అడుగుల వెడల్పు గల భారీ తెరలు ప్రపంచంలో మరో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్ వర్గాలు పేర్కొన్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో మరో రెండు తెరలు ఉంటాయి.













