తిరుపతి సీటు తమకే అంటున్న బలిజలు.. ఈ కాన్సెప్ట్ జనసేన ని కలిసొచ్చేనా?
ఈసారి ఎన్నికలలో కూటమిగా ఏర్పడి పొత్తులతో ముందుకు పోవడానికి టీడీపీ తో చేతులు కలిపింది జనసేన. ఈ నేపథ్యంలో తమకి తక్కువ సీట్లు వచ్చాయి అని ఇప్పటికే జనసైనికులు తెగ తలకిందులు అవుతున్నారు. ప్రస్తుతం ఇంకా అనౌన్స్ చేయాల్సిన సీట్లలో తమ సామాజిక వర్గానికి చెందిన కొన్ని స్థానాలను వారు తమ ఖాతాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా జనసేన బలంగా ఉన్నాము అని భావించే ప్రాంతాలలో తిరుపతి నియోజక వర్గం కూడా ఒకటి. ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే తమ సామాజిక వర్గానికి చెందిన వారే కావాలని బలిజ సేన పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో బలిజ సేన ఆధ్వర్యంలో మన బలిజ -మన తిరుపతి పేరుతో గురువారం తిరుపతిలో బలిజ నాయకుల మధ్య ఓ పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కాదు అని వేరే సామాజిక వర్గానికి సీటు ఇస్తే తాము సహకరించము అంటూ హెచ్చరిస్తున్నారు. మరోపక్క తిరుపతి నుంచి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది అని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ మన బలిజ-మన తిరుపతి కాన్సెప్ట్ పవన్ కి బాగా అచ్చోచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు తిరుపతి నియోజకవర్గం పవన్ కి అప్పజెబుతాడు అన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతుంది.













