కన్నాను బాగానే వాడుతున్న బాబు, వాళ్ళు కూడా టీడీపీ కండువా కప్పుకుంటారా…?
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎలా అయినా రావాలని కష్టపడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా వేయబోయే అడుగులు ఎలా ఉంటాయి అనే దానిపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు గానే కనపడుతుంది. గెలుస్తారు అనుకునే నాయకులకు సీట్లను ముందే ఖరారు చేసి వారిని పార్టీలోకి తీసుకునే విధంగా రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీ నారాయణను పార్టీలోకి తీసుకున్నారు.
ఇప్పుడు రఘువీరా రెడ్డిని పార్టీలోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయనతో పాటుగా శైలజానాథ్ ను అనంతపురం నుంచి పార్టీలోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాద రహితులు కావడం మంచి రాజకీయ అనుభవం ఉండటంతో వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. వారికి కన్నా తో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే వారిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారు కోరిన సీటు ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పెసినట్టుగా కూడా సమాచారం. అటు జేసీ ఫ్యామిలీ కూడా వాళ్ళతో చర్చలు జరుపుతుంది.
అలాగే గతంలో ప్రజా రాజ్యంలో పని చేసిన నాయకులను కూడా ఇప్పుడు పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. కాపు సామాజిక వర్గ నేతల మీద ఎక్కువగా చంద్రబాబు ఫోకస్ చేసారని సమాచారం. దాదాపు 8 మంది నేతలకు టీడీపీ లో మార్గం సుగుమం చేసారని అంటున్నారు. వచ్చే రెండు మూడు నెలల్లోనే లోకేష్ పాదయాత్రలో వారిని పార్టీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన కొందరు బలమైన నాయకులకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసింది.













