Rammohan Naidu: ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు : మంత్రి రామ్మోహన్ నాయుడు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) స్పందించారు. విశాఖ (Visakhapatnam) లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు (Pilots) , సిబ్బంది (Staff) మన దగ్గర ఉన్నారు. వారు పౌర విమానయానానికి వెన్నెముక వంటివారు. ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచ్చిచూద్దాం. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ (Technical) అంశాలు ఇమిడి ఉన్నాయి. అందుకే ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది అని అన్నారు.













