ఆటా నుంచి అమెరికా తెలుగు కన్వెన్షన్ కు కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఆహ్వానం
మే 31వ తేది నుండి జూన్ 2 వరకు మూడు రోజుల పాటు అమెరికాలోని డల్లాస్ నగరంలో జరగనున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ కు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆహ్వానం అందుకున్నారు. నవ్యాంధ్రలోని అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో సమర్థవంతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో అమెరికా తెలుగు కన్వెన్షన్‌కు అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆటా అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, టాటా (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్) అధ్యక్షులు హరీనాథ పొలిచర్లలు సంయుక్తంగా ఆహ్వానం పంపారు. ఈ కన్వెన్షన్‌లో సుమారు 4,500 మందికి పైగా తెలుగు నేపధ్యం వున్న కవులు, రచయితలు, మేధావులు భాషావేత్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఔత్సాహికులు, ప్రతిభావంతులు, యువత పాల్గొనడం జరుగుతోంది. ఈ సదస్సు ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్, లాస్ కొలినాస్, డల్లాస్‌లలో జరగనుంది.













