భర్త ప్రచారంలో పాల్గొన్న ఆరోపణ.. సస్పెండ్ అయిన ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్..
ఆంధ్రాలో ఈసారి ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు పోలింగ్ ముగిసినప్పటికీ.. ఇంకా ఏదో ఒక సంఘటన వైరల్ అవుతూనే ఉంది. తాజాగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ చేయడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. గాజువాకలో కూటమి తరఫున పళ్ళ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పై పోటీ చేశారు.ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు కూడా అభ్యర్థులకు సంబంధించిన ఎటువంటి ప్రచారాలలో పాల్గొనడానికి వీలులేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మే నెల 4వ తారీఖున లావణ్య భర్త తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అని రిటర్నింగ్ అధికారి షోకాజ్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించారు అని నోటీసులు అందడంతో స్పందించిన లావణ్య.. తాను శ్రీవాణి అనే మహిళను కలిశానని.. ర్యాలీలో పాల్గొనలేదు అని వివరణ ఇచ్చారు. కానీ ఆమెను ఏయూ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు.













