దారుణంగా మారిన ఏపీ బీజేపీ పరిస్థితి.. పక్క చూపులు చూస్తున్న కీలక నేతలు
ఏపీలో బీజేపీ నేతలు చాలామంది పక్క చూపులు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పార్టీ మారుదామా.. అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం మినహా బిజెపికి మరో దారి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ఇన్నాళ్లు పవన్ తమతో కలిసి వస్తాడని బిజెపి నమ్మేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..
గత ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆరు శాతం దాకా ఓట్లు వచ్చాయి. ఈసారి జనసేన ప్రభావం దాదాపు 11 శాతానికి పెరిగిందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో బిజెపి ఓటింగ్ ఒక శాతానికి మించి లేదు. గతంలో నోటాకు మించి కూడా ఓట్లు రాలేదు. కేవలం 0.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్నిబట్టి ఒంటరిగా వెళితే బిజెపికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే బిజెపితో కలిసి ప్రయాణం చేసేందుకు ఆ పార్టీలోని నేతలు కూడా ఇప్పుడు సిద్ధంగా లేరు. అందుకే పక్క చూపులు చూస్తున్నారు.
ఇన్నాళ్లు జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తాయని కమలం పార్టీ నేతలు ఆశగా ఉన్నారు. అదే జరిగితే కాస్త కూసో ప్రభావం ఉంటుందని, కొన్నిచోట్ల గెలుపు అవకాశాలు ఉంటాయని భావించారు. అయితే బిజెపి, అధికార వైసీపీతో సఖ్యతగా మెలగడం.. తమ పార్టీపై జగన్ అణచివేత ధోరణి అవలంబిస్తున్న బిజెపి నేతలు నోరు తెరవకపోవడం పవన్ కు ఆగ్రహం తెప్పించింది. పైగా వైసీపీని ఓడించాలంటే బిజెపిని వదిలి టిడిపి తో వెళ్లడమే బెటర్ అని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. దీంతో బిజెపి నేతలు కూడా తాము ఇక్కడే ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపితో ప్రయాణానికి ఎవరో సిద్ధంగా లేరు. అందుకే బిజెపి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన కీలక నేతలతో పాటు కమలం పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్న లీడర్లు కూడా ఈసారి పార్టీ మారడం కాయంగా కనిపిస్తోంది. వైసిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సంకేతాలు వస్తుండడంతో ఎక్కువ మంది చూపు టిడిపి వైపు ఉంది. మరి కొంతమంది జనసేనలో చేరే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల్లో అవకాశాలు లేని వాళ్ళు వైసీపీ వైపు మొగ్గు చూపునున్నారు. దీంతో ఏపీలో బిజెపి పరిస్థితి ఈసారి మరింత దయనీయంగా మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.













