Janasena: భారీ ఎత్తున జనసేన జయకేతనం ఏర్పాట్లు..
జనసేన పార్టీ (Janasena) తన 11 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని రేపు ఘనంగా జరుపుకోబోతోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనసేన జరుపుకుంటున్న ఈ వేడుకలు జనసేన కార్యకర్తలతో పాటు అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకమైనవి.పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలో, ఈ పార్టీ ఏపీ అధికార కూటమిలో కీలక భాగస్వామిగా పేరొందినందున, రేపు జరిగే ఈ వేడుకలు జనసేన విజయ గాధను, ప్రజా మద్దతును , నిరంతర సంకల్పాన్ని మరింత ప్రతిభంభించేలా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జయకేతనం (Jayakethanam) అనే పేరుతో నిర్వహిస్తున్నారు.
ఒక ప్రాంతీయ పార్టీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన జనసేన.. నిలబడుతుందా అనుకున్న పరిస్థితులను ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనాన్ని సృష్టించింది. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పవన్ కొనసాగిస్తున్న జోరు భవిష్యత్తులో జనసేన పురోగతికి ఎంతో ప్రాధాన్యత తెచ్చిపెడుతున్నాయి.
ఇక ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు చెప్పవచ్చు. వాహన పార్కింగ్ కోసం ఐదు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించబడినవి, తద్వారా వేడుకలో పాల్గొనే ప్రజలకు సౌకర్యం కల్పించబడుతుంది. ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని 14 అంబులెన్స్‌లు మరియు 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి, తద్వారా ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించగల వ్యవస్థ ఏర్పడుతుంది.
రేపు కార్యక్రమంలో హాజరయ్యే ప్రతి ఒక్కరి సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనే అభిమానులకు తగిన నీరు, మజ్జిగ, ఆరోగ్యకరమైన భోజన వసతి అందించేందుకు అన్ని చర్యలు తీసుకోబడ్డాయి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రత దృశ్య పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భోజనంలో కొన్ని రకాల పండ్లను ఆహార పదార్థాలను కూడా జోడించాల్సిందిగా సూచించారట.ఇది ఆయనకు ప్రజల పట్ల ఉన్న ఆప్యాయతకు చిహ్నంగా జనసేన నేతలు భావిస్తున్నారు.రేపు జరగబోయే ఈ వేడుకలో జనసేన పార్టీ తన విజయాన్ని, ప్రజా మద్దతును మరింత స్పష్టంగా వెలిబుచ్చేలా చేస్తాయని భావించవచ్చు.













