ఏపీ ప్రజలకు ఆర్టిజిఎస్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆర్టిజిఎస్ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని కాబట్టి ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్టిజిఎస్ తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టిజిఎస్ తెలిపింది.













