Revenue Department : ఏపీ రెవెన్యూశాఖకు.. జాతీయ స్థాయిలో

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ (Revenue Department )కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు (Awards )లు వరించాయి. 2025 ఏడాదికిగాను రాష్ట్ర రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్‌లు అవార్డులు వచ్చాయి. ఆన్‌లైన కోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు దక్కాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రెవెన్యూ శాఖకు వచ్చినట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Satya Prasad) వెల్లడిరచారు. విప్లవాత్మక సంస్కరణలకు అవార్డులు వరించినట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల కృషి కారణంగానే అవార్డులు వచ్చాయని అభినందించారు. వచ్చే నెల 20న ఢిల్లీ (Delhi)లో స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.