ప్రాంతీయ పార్టీలో రాష్ట్రానికి నష్టం తప్ప.. ప్రయోజనం లేదు
ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండి చేయి చూపిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావనే లేదన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందన్నారు. కేంద్రం మొడలు వంచుతామన్న జగన్, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.













