మంత్రి రోజాకు శాయ్ లో చోటు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( శాయ్ ) సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి జతిన్ నర్వాల్ నుంచి ఆమెకు ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా రోజాను పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మంత్రి రోజా మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని క్రీడారంగ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. జగనన్న క్రీడాసంబరాలు, సీఎం కప్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు అత్యున్నత ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజా రెండో విడత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.













