Nara Lokesh : ఉద్యోగాలు చేస్తేనే వారికి ఇంటా బయటా గౌరవం : లోకేశ్
సమాజంలో నిత్యం మార్పులు వస్తున్నాయని, వాటిని స్వీకరిస్తేనే మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. విజయవాడ(Vijayawada) లో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ (Green Energy Conference ) లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ కృత్రిమ మేధ ( ఏఐ) క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మరింత నైపుణ్యం పెంచుకోవాలన్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ ఐటీఐలను దత్తత తీసుకొని ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నాయని తెలిపారు. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. నా పాదయాత్రలో ఎక్కడ చూసినా మహిళా ఉద్యోగులు (Women Employees) కనిపించారు. కియా వచ్చాక వేలమంది మహిళలకు ఉపాధి దొరికింది. పిల్లలను బాగా చదివించుకునేందుకు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తేనే ఇంటా బయటా వారికి గౌరవం పెరుగుతుంది అని అన్నారు.







