దేశంలోనే తొలిసారిగా ఏపీలో : మంత్రి గొట్టిపాటి
ఛార్జీలు పెంచకుండా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar)తెలిపారు. శ్రీసిటీ (Sri City)లో పర్యటించిన మంత్రి అక్కడి బిజినెస్ సెంటర్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీల (Electricity Charges)ను ట్రూడౌన్ (Trudown) చేశామన్నారు. పెట్టుబడిదారులకు విద్యుత్ రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. శ్రీసిటీలో 31 దేశాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. శ్రీసిటీ ప్రత్యక్షంగా 70 వేల మందికి ఉపాది కల్పిస్తోందని, మరో లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








